భాషాసంక్షోభం: ఎందుకు రాయవలసివచ్చిందంటే …

అసలు ఇది ఎందుకు రాయవలసివచ్చిందంటే ... ఈ నేలమీద జీవుల్లో మనిషితోపాటే పుట్టి మనిషిని మనిషిగా నిలబెట్టినదీ మనిషంత ప్రాచీనమైనదీ భాషే. మానవ వికాసంలో ఒక విశిష్ట లక్షణంగా ఉత్పన్నమైనదీ భాషే.  మనిషి పుట్టుక భాషతోనే. అంటే మనిషికి మనిషిగా గుర్తింపు వచ్చినదీ భాషతోనే. మనిషి వయసు ఎంతో భాష వయసూ అంతే. దీంతో ఒకరి భాష అతి ప్రాచీనమనీ మరి కొందరి భాష నిన్న మొన్నటిదనీ అనే ఆలోచనలకు ఆస్కారం లేదు. అలాగే ఒక భాష... Continue Reading →

భాష – ఆర్థిక వ్యవస్థ – సామాజిక సంబంధాలు – 1

1.0 పరిచయం సమాజంలో భాషకూ సంపదకూ అవినాభావ సంబంధం ఉంది. భాషతో సంపదను సృష్టిస్తాం. ఇది, భాషను ప్రత్యేక పరిస్థితులలో వాడే ఉపాధ్యాయులూ, రచయితలూ, పాత్రికేయులూ, నటులూ మొదలైనవారికి మాత్రమే పరిమితం కాదు. భాషను వాడేవారందరికీ సంబంధించినది. బతకడానికి చేసే ప్రతి పనీ సంపద సృష్టితో ముడిపడివున్నదే. ఈ నేలపై బతికేవారందరూ సంపద సృష్టిలో పాలుపంచుకొనేవారే. సంపద సృష్టికి భాష ఒక ప్రధాన సాధనం. భాషలు సమాజంలోని ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తాయి. ఇది చెప్పడానికి వేరే... Continue Reading →

వాణిజ్యానికి కీల‌కం కాబ‌ట్టి ఇంగ్లీష్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుసంధాన భాష‌గా వుంది. అంత‌మాత్రాన ఇంగ్లీషే స‌ర్వ‌స్వంగా భావించ‌న‌క్క‌ర్లేదు.

నేడు నేర్వడానికి ఉండని భాష, రేపు వాడకానికి మిగలదు

తెలుగును బోధనా మాధ్యమానికి దూరంచేస్తే, వచ్చే రెండు దశాబ్దాలలో జరగబోయే విధ్వంసం దానితో కలిగే సామాజిక సంక్షోభం యుద్ధంకంటే భయానకమైనది.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

Up ↑